లక్షల టన్నుల మట్టిని కదిలించి.. 2 వేల ఏళ్ల క్రితం రోమన్ల బంగారం తవ్వకాలు!
- స్పెయిన్లోని పిరనీస్ పర్వతాల్లో రోమన్ల కాలం నాటి బంగారు గని గుర్తింపు
- సుమారు 2000 ఏళ్ల క్రితం హైడ్రాలిక్ విధానంలో తవ్వకాలు
- లక్షల టన్నుల మట్టిని కదిలించినట్లు పరిశోధనలో వెల్లడి
- అప్పట్లో నిర్మించిన రిజర్వాయర్ ఆధారంగా వయసు నిర్ధారణ
- రోమన్ల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన నిర్మాణాలు
స్పెయిన్లోని పిరనీస్ పర్వత శ్రేణుల్లో దాదాపు 2000 ఏళ్ల నాటి ఓ పురాతన రహస్యం వెలుగులోకి వచ్చింది. అక్కడి పర్వత ప్రాంతంలో ఉన్నది సహజ నిర్మాణం కాదని, రోమన్ల కాలంలో భారీ స్థాయిలో హైడ్రాలిక్ విధానం ఉపయోగించి బంగారం తవ్వకాలు జరిపిన ప్రదేశమని పరిశోధకులు నిర్ధారించారు. లక్షల టన్నుల మట్టిని కదిలించి, పర్వత స్వరూపాన్నే మార్చేసిన ఈ తవ్వకాలు రోమన్ల ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి.
స్పెయిన్-ఫ్రాన్స్ సరిహద్దుల్లోని సెర్డాన్యా లోయలో ఉన్న 'గిల్లెటెరెస్ డి ఆల్' అనే ప్రదేశంలో కృత్రిమ కందకాలు, వృత్తాకారంలో ఉన్న లోతైన ప్రాంతంపై పరిశోధకులు దృష్టి సారించారు. 2010 నుంచి 2022 వరకు జరిపిన తవ్వకాల్లో 4.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల లోతు ఉన్న ఓ పురాతన రిజర్వాయర్ బయటపడింది. దీని ఆధారంగా ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ ల్యూమినిసెన్స్ (ఓఎస్ఎల్) డేటింగ్ పద్ధతి ద్వారా ఈ నిర్మాణం క్రీస్తు శకం 2వ శతాబ్దం చివరి నుంచి 3వ శతాబ్దం మధ్యలో వదిలేసినట్లు గుర్తించారు.
రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని ఒక్కసారిగా కిందికి వదిలి, ఆ నీటి ప్రవాహపు ఒత్తిడితో బంగారం ఉన్న మట్టిని, రాళ్లను కరిగించేవారు. ఆ తర్వాత కిందికి ప్రవహించిన నీటిలోంచి బంగారు రేణువులను వేరు చేసేవారు. ఈ పద్ధతిలో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కదిలించినట్లు అంచనా. ప్లినీ ది ఎల్డర్ వంటి ప్రాచీన రచయితల గ్రంథాల్లో కూడా ఈ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు ప్రస్తావనలు ఉన్నాయి. సమీపంలో ఓ లోహ పరిశ్రమ, శ్మశానవాటికలో దొరికిన బంగారు కడియం వంటి ఆనవాళ్లు.. ఈ గని అప్పటి రోమన్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిందని సూచిస్తున్నాయి.